కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మార్చి 26న రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత తరపున లాయర్లు అదే రోజున పిటిషన్ దాఖలు చేశారు. తన చిన్న కొడుకుకు పరీక్షలు ఉండడంతో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత కోర్టును విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది.