అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత తరపున దాఖలైన పిటిషన్ పైన శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కాగా.. ఈ కేసులో తాము బెయిల్ ఇవ్వలేమని, కింది కోర్టును ఆశ్రయించాలని సూచించింది. త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం సూచించింది. మరోవైపు రాజ్యాంగ పరమైన ఉల్లంఘన జరిగిన అంశాలను లేవనెత్తినందున ఈ విషయమై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది.