ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. రెండు గంటల కిందట సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళిన ఈడీ అధికారుల బృందం చివరకు ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అధికారికంగా అరెస్టు చేసినట్లు వెల్లడించింది. కాసేపట్లో ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు.