అరెస్టు రాజకీయ కుట్రలో భాగమే..

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: లిక్కర్‌ స్కాంలో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని.. న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆమె పేర్కొన్నారు. విచారణలో ఏడాది కిందట అడిగిన ప్రశ్నలే మళ్లీమళ్లీ అడిగారని.. కేసులో కొత్త విషయాలేమీ లేవని తెలిపారు. శనివారం కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చేందుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. మరో అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఇంకోవైపు కవిత బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం ఈడీ సోదాలు జరిగాయి.