అక్షరటుడే, వెబ్‌డెస్క్: సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy అన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంట్ స్థానాల పునర్విభజనకు Delimitation వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. తమిళనాడు Tamilanadu మంత్రి కేఎన్ నెహ్రూ ఆధ్వర్యంలో డీఎంకే DMK ఎంపీలు కనిమొళి, రాజా తదితరులు ఢిల్లీలో రేవంత్‌రెడ్డిని కలిశారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 22న చైన్నైలో సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశానికి ఆయనను ఆహ్వానించారు.
Delimitation | రాజకీయంగా పట్టు చిక్కడం లేదనే..
డీఎంకే ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి Revanth Reddy మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై సమావేశం ఏర్పాటు చేసిన స్టాలిన్‌ను అభినందించారు. ఏఐసీసీ అనుమతి తీసుకొని సమావేశానికి వెళ్తానని తెలిపారు. దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల South States భాగస్వామ్యం ఎంతో ఉన్నా.. తమకు రాజకీయంగా పట్టు చిక్కడంలేదనే అక్కసుతో బీజేపీ BJP డీలిమిటేషన్ చేయాలని చూస్తోందని సీఎం ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టి ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Delimitation | త్వరలో అఖిలపక్ష సమావేశం
డీలిమిటేషన్‌పై తెలంగాణలో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క Bhatti Vikramarka, మాజీ మంత్రి జానారెడ్డి Janareddy ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్‌కు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. పౌర సమాజం ప్రతినిధుల అభిప్రాయాలను కూడా తీసుకొని నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి నివేదిస్తామన్నారు.