అక్షరటుడే వెబ్‌డెస్క్‌: స్టాక్‌మార్కెట్‌లో సోమవారం డీమార్ట్‌ షేర్లు భారీఎత్తున పతనమయ్యాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఉండే డీమార్ట్‌ షేర్లు 9 శాతం మేర నష్టపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఏకంగా రూ. 27వేల కోట్ల మేరకు పడిపోయింది. కంపెనీకి సంబంధించి క్వార్టర్ రిజల్ట్స్‌లో రూ. 659.44 కోట్ల మేర లాభాన్ని ప్రకటించింది. మొత్తంగా కంపెనీ ఆదాయం 14.41 శాతం పెరిగి రూ. 14,444.50 కోట్లుగా నమోదైంది. అయితే ఖర్చులు కూడా 14.94 శాతం పెరిగినట్లు కంపెనీ చూపించడం షేర్ల పతనానికి కారణమైంది.