అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా నిజామాబాద్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏం.సోమయ్య, లింగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలయ్య, ఓమాజీ తదితరులు పాల్గొన్నారు.