అక్షరటుడే, ఇందూరు: నగరంలోని వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులకు ఒకరోజు వేతనం కట్ చేస్తు డీఈవో అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలకు సమయానికి రాకపోవడంతో ముందుగా షోకాజ్ నోటీసులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు సంజాయిషీ ఇవ్వగా.. ఒకరోజు వేతనాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ డిసెంబర్లో మూడు రోజులపాటు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. దీంతో కాంప్లెక్స్ హెచ్ఎం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, మూడు రోజుల వేతనాన్ని వెనక్కి తీసుకోవాలని డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement