అక్షరటుడే, ఇందూరు: గణితం ఎంతో సులువైన సబ్జెక్ట్ అని డీఈవో అశోక్ అన్నారు. తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో మ్యాథమెటిక్స్ ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి గణితంపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడారు. అలాగే పలువురు గణిత ఉపాధ్యాయులకు మైకేల్ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఉత్తర దక్షిణ మండలాల ఎంఈవోలు ఎన్వీ గౌడ్, సాయరెడ్డి, గణిత ఫోరం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి అశోక్, చంద్రశేఖర్, కాంతారావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.