అక్షరటుడే, ఇందూరు: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేలా బోధించాలని డీఈవో దుర్గాప్రసాద్‌ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం డిచ్పల్లి మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.