Advertisement

అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో మెరిట్ కం రోస్టర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో నవంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అకౌంటెంట్ పోస్ట్ కు కామర్స్ లో డిగ్రీ, కంప్యూటర్స్లో సర్టిఫికెట్ కోర్సు చేసిన వారు అర్హులన్నారు. ఏఎన్ఎం పోస్టుకు ఇంటర్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పొందిన వారు అర్హులని చెప్పారు.

Advertisement