అక్షరటుడే, ఇందూరు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 6, 7 తేదీల్లో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో అశోక్ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు సందర్శించి ప్రదర్శనలు తిలకించాలని కోరారు.