అక్షరటుడే, ఇందూరు: విద్యార్థులు గణితంపై శ్రద్ధ పెడితే సులువుగానే ఉంటుందని డీఈవో అశోక్ అన్నారు. శుక్రవారం కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఉప్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీలను సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అనంతరం నోట్ బుక్ లను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. డీఈవో వెంట మోర్తాడ్, కమ్మర్ పల్లి ఎంఈవోలు ఉన్నారు.