అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ఆదివారం వారు హైదరాబాద్ నుంచి డీజీపీ జితేందర్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, పోలీస్ కమిషనర్‌లు, ఎస్పీలతో వరద ప్రభావిత పరిస్థితులపై సమీక్షించారు. చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే అవసమరమైతే సహాయక బృందాలు పంపిస్తామని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చే వరకు వేచి చూడకుండా పోలీసులు, ఫైర్ సిబ్బంది సేవలను వినియోగిస్తూ ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement