నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల అందజేస్తామని, ఎస్టీ, ఎస్టీలకు రూ.6 లక్షలు చెల్లిస్తామని చెప్పారు.