Deputy CM | కేటీఆర్​ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఆగ్రహం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deputy CM | మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలతో బుధవారం అసెంబ్లీలో దుమారం రేగింది. కాంగ్రెస్​ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్​ అంటూ కేటీఆర్​ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాగా కేటీఆర్‌ కామెంట్లను స్పీకర్​ రికార్డుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీఆర్​ఎస్​ అని, అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CAG Report | అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం