అక్షరటుడే, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల నిర్వహణ, ప్రచారం అంశాల విధివిధానాల రూపకల్పనకు భట్టి అధ్యక్షతన కేబినేట్ సబ్ కమిటీ శనివారం సమావేశమైంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ జయంతి నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం వరకు జరగనున్నాయి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ‘ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి, స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన, పారామెడికల్, నర్సింగ్ కళాశాలల ప్రారంభం, గ్రూప్ -4 ఎంపికైన వారికి నియామక పత్రాలు’ అందజేస్తామని భట్టి వెల్లడించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement