అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్టంలోని ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించామని, దశల వారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతామని చెప్పారు.