అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో పోలీసుశాఖకు సంబంధించిన అవసరాలన్నీ తీరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం హోంశాఖ ప్రీ బడ్జెట్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్​లో మూడు నగరాలతో పాటు నాలుగో ఫ్యూచర్ సిటీ కూడా సిద్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు, వాతావరణం, ఉపాధి అవకాశాల నేపథ్యంలో పెద్దఎత్తున హైదరాబాద్​కు, రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయన్నారు. భద్రత విషయంలో హోం శాఖ మరింత సిద్ధం కావాల్సిన అవసరముందన్నారు.