Pawan Kalyan : స‌భ‌కి వ‌చ్చిన కార్య‌క‌ర్త బిడ్డ‌ని భుజాల మీద‌కి ఎక్కించుకున్న ప‌వ‌న్.. ఆ త‌ర్వాత‌..!!

Pawan Kalyan : స‌భ‌కి వ‌చ్చిన కార్య‌క‌ర్త బిడ్డ‌ని భుజాల మీద‌కి ఎక్కించుకున్న ప‌వ‌న్.. ఆ త‌ర్వాత‌..!!
Pawan Kalyan : స‌భ‌కి వ‌చ్చిన కార్య‌క‌ర్త బిడ్డ‌ని భుజాల మీద‌కి ఎక్కించుకున్న ప‌వ‌న్.. ఆ త‌ర్వాత‌..!!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) .. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగానే కాకుండా సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తిగా ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఇక రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక (Pawan Kalyan) ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కి మ‌రింత ద‌గ్గ‌రయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌లోనే ఉంటున్నాడు. తాజాగా క‌ర్నూలు జిల్లా పూడిచెర్లలో భూమి పూజ చేశారు. అనంత‌రం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దీనికి భారీగా టీడీపీ, జనసైనీకులు తరలివచ్చారు. ఇంతలో ఒక కార్యకర్త తన బిడ్డ తలకు ఎర్రటి తువ్వాలు చుట్టి.. అచ్చం పవన్ కళ్యాణ్ లా రెడీ చేయ‌డంతో ఆ బుడ్డోడిపై ప‌వ‌న్ దృష్టి ప‌డింది. వెంట‌నే ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఆ బుడ్డొడిని తన దగ్గరకు పిలిపించుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు.

Advertisement

Pawan Kalyan : ఆనంద‌మే వేరు..

దీంతో ఆ బుడ్డొడు, కార్యకర్త ఆనందానికి మాత్రం హద్దులు లేవని చెప్పుకొవచ్చు. బుడ్డోడితో కూడా ప‌వ‌న్ ఏదో ముచ్చ‌టించారు. ఆ బుడ్డొడు మాత్రం తెగ సంబరపడ్డాడు.నవ్వుతూ అందరికి అభివాదం చేశాడు. పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఆ బిడ్డను ఎత్తుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఎక్కడకు వెళ్లిన కూడా అక్కడ రచ్చ మాములుగా ఉండదు. చాలా మంది అభిమానులు.. పవన్ తమవైపు చూస్తే పండగ చేసుకుంటారు. ఆయనతో కరచాలనం కోసం ఎంతో తాపత్రయ పడిపోతుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Pawan Kalyan | పవన్ కళ్యాణ్ తో ఫైట్ కి సిద్ధమా.. శ్రీవిష్ణు సింగిల్ చాలా రిస్క్ చేస్తున్నాడే..?

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు, రాజ‌కీయాల‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.. ఓజీ సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి కల్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ హోరెత్తిస్తున్నారు అభిమానులు. కర్నూలు జిల్లాలోని పూడిచర్లలో జ‌రిగిన సభలో ప్రసంగిస్తుండగా ఫ్యాన్స్‌ చేసిన ఓజీ సౌండ్..చేశారు. దానికి ప‌వన్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) న‌వ్వుతూనే స‌మాధానం ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలపై తాను ఫోకస్ చేస్తుంటే.. ఫ్యాన్స్‌ ఇంకా ఓజీ మూడ్‌లోనే ఉండిపోవడం తనకు నచ్చలేదంటూ కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేశారు (Pawan Kalyan) ప‌వ‌న్ క‌ళ్యాణ్ . అయితే పవన్ తన అభిమానుల మనసు నొచ్చుకోకుండా సున్నితంగా నవ్వుతూ తన మనసులోని మాట చెప్పారు . మీతో పెట్టుకోలేం.. మీకో నమస్కారం అనేశారు పవన్ కల్యాణ్‌. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Advertisement