Pawan Kalyan Younger Son : అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ప‌వన్ కుమారుడు.. హుటాహుటిన సింగ‌పూర్‌కి

Pawan Kalyan Younger Son : అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ప‌వన్ కుమారుడు.. హుటాహుటిన సింగ‌పూర్‌కి
Pawan Kalyan Younger Son : అగ్ని ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ప‌వన్ కుమారుడు.. హుటాహుటిన సింగ‌పూర్‌కి

అక్షర టుడే, వెబ్ డెస్క్ Pawan Kalyan Younger Son : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) పవనోచ్ అగ్ని ప్ర‌మాదంలో (Fire hazard) గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు కావ‌డంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మార్క్ శంకర్ (Mark Shankar) అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం తన విశాఖ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని సింగపూర్ బయల్దేరిన‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లారు.

Advertisement

Pawan Kalyan Younger Son : పరిస్థితి ఎలా ఉంది..

మార్క్ శంకర్ పవన్ కల్యాణ్-అన్నలెజినోవా (Pawan Kalyan-Annalezinova) దంపతుల సంతానం కాగా అత‌ను సింగ‌పూర్‌లో ఎందుకు చదువుకుంటున్నాడ‌నే చ‌ర్చ న‌డుస్తుంది. ప‌వన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో ఉంటున్నారు.. ఆమె గతేడాది సింగపూర్‌లోని (Singapore) నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్‌నేవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌తో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు. కుమారుడ్ని అక్కడే స్కూల్‌లో చదివిస్తుంది. ప్ర‌స్తుతం రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్‌లో మార్క్ శంకర్ చదువుతున్నాడు. ఈ స్కూల్‌లో కిచెన్‌ లెసెన్స్ చెబుతారట.. అన్నా అక్కడ స్టడీస్ చేస్తూ.. కుమారుడ్ని కూడా సింగపూర్‌ singaporeలో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త‌న ఫ్యామిలీని క‌లిసేందుకు ఒకటి రెండు సందర్భాల్లో సింగపూర్ వెళ్లొచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Mark Shankar | తిరుమలలో పవన్​ కుమారుడి పేరిట అన్నదానం

భార్య యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి మాస్టర్స్ డిగ్రీ అందుకోవడంతో జనసేన కార్యకర్తలు, Jana Sena activists, Pawan Kalyan fans, పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ పవనోవిచ్ స్కూల్‌కు school వెళ్లిన సమయంలో ఈ అగ్నిప్రమాదం జరగ్గా.. ఈ అగ్నిప్రమాదంలో 14మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియడంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగ‌పూర్ వెళ్లారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని ఏజెన్సీలో అడవి తల్లిబాట రెండో రోజు పర్యటనలో ఉన్నారు. కాగా, పవన్ కల్యాణ్‌కి మొత్తం నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. రేణు దేశాయ్‌కి ఒక అమ్మాయి, కొడుకు ఉండగా..ఇప్పుడు అన్నా లెజినోవాకి ఒక అమ్మాయి, మరొక బాబు ఉన్నారు.

Advertisement