అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య, వసతి అందించేందుకు ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్‌ సమావేశాల్లో తెలిపారు. అన్ని జిల్లాల్లో ఒక్కో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలను 20 ఎకరాల్లో నిర్మించనున్నామని పేర్కొన్నారు. ఒకే ప్రాంతంలో వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ గురుకుల పాఠశాలలను ఒకేచోట నిర్మిస్తామన్నారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు, విద్య అందిస్తామని ప్రకటించారు. ఈ పాఠశాలల వల్ల అన్ని వర్గాల విద్యార్థుల మధ్య అంతరాలు తొలగిపోయి స్నేహభావం పెరుగుతుందని పేర్కొన్నారు.