అక్షరటుడే, వెబ్‌డెస్క్: Annamayya district | రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ Special Deputy Collector మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ రాయచోటి కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు పీలేరు నుంచి బయలుదేరారు. సంబేపల్లె మండలం యర్రగుంట్ల Yarraguntla వద్ద వీరి కారు, మరో కారు ఢీకొన్నాయి.
ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ Special Deputy Collector Rama అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రమ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన సూచించారు.