అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య తనిఖీ చేశారు. ఆస్పత్రులలోని రిజిస్టర్లను పరిశీలించారు. నిబంధనలకు లోబడి ఆస్పత్రుల నిర్వహణ ఉండాలని సూచించారు. ఆమె వెంట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దయానంద్ తదితరులున్నారు.