government hospitals | రూ.85 కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి

government hospitals | రూ.85 కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి
government hospitals | రూ.85 కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి

అక్షరటుడే, కామారెడ్డి: government hospitals | ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో joint Nizamabad district ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ Government advisor Shabbir Ali తెలిపారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ Health Minister Damodar Rajanarsimha అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలపై మంత్రికి వివరించారు. నిజామాబాద్‌లోని 750 పడకల ఆస్పత్రిలో అదనంగా రెండు లిఫ్టులు, మౌలిక వసతుల కల్పన, అప్‌గ్రేడేషన్‌ పనులకు ఆమోదం తెలిపినట్లు షబ్బీర్​ అలీ తెలిపారు. కామారెడ్డిలోని 250 పడకల ఆస్పత్రిలో సిటీస్కాన్, ట్రామా సెంటర్‌ ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. దోమకొండ ఆస్పత్రిని రూ.22కోట్లతో 50 పడకలుగా అప్‌గ్రేడ్‌ చేసినట్లు పేర్కొన్నారు. వైద్యశాఖ మంత్రి త్వరలోనే జిల్లాలో పర్యటించి పనులు ప్రారంభిస్తారన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Harish Rao | కూతురు పెళ్లికి హరీష్​రావును ఆహ్వానించిన జడ్పీ మాజీ ఛైర్మన్​ దఫేదార్​ రాజు