అక్షరటుడే, వెబ్డెస్క్: TTD | తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై recommendation letters TTD దర్శనానికి టీటీడీ ఇటీవల అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం సిఫార్సు లేఖలపై మొదటిరోజు శ్రీవారిని భక్తులు devotees దర్శనం చేసుకున్నారు. తొలిరోజు 550 నుంచి 600 మంది వరకు తెలంగాణ లెటర్స్పై వీఐపీ బ్రేక్ దర్శనాలు VIP break darshans కేటాయించినట్లు టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
TTD | సోమవారం నుంచి అమలులోకి..
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు Telangana public representatives లేఖలను ఆమోదించాలని కొంతకాలంగా డిమాండ్ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా సిఫార్సు లేఖలను అనుమతించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని చెప్పినా.. టీటీడీ TTD మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇటీవల తిరుమల వెళ్లిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు MP Raghunandan Rao సిఫార్స్ లేఖలను ఆమోదించకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరం వచ్చి టీటీడీతో తేల్చుకుంటామని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీటీడీ సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది.
TTD | ఒక లేఖపై ఆరుగురికి దర్శనం
తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల Telangana MPs and MLAs సిఫార్సు లేఖలపై భక్తులకు దర్శనం darshan కల్పించనున్నారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణ నుంచి వచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం VIP break darshan కల్పించనున్నారు. బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం అనుమతిస్తారు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి రోజుకు ఒక లేఖను మాత్రమే అనుమతిస్తారు. ఒక్కో లేఖపై ఆరుగురికి దర్శనం కల్పించనున్నారు.