అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర డీజీపీ జితేందర్ మంగళవారం పలువురు పోలీసు అధికారులను అభినందించారు. మెదక్‌ జిల్లా శంకరంపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్య కేసులో సరైన సమయంలో సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో ఓ నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. కాగా.. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ప్రస్తుత కామారెడ్డి సీఐ చంద్రశేఖర్‌రెడ్డిని అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. అలాగే గతంలో బిచ్కుంద సీఐగా పనిచేసిన ఆర్‌.కృష్ణకు కూడా డీజీపీ ప్రశంసాపత్రం అందించారు.