అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌ : రోడ్లమీదికి వచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. జీవో 29ని రద్దు చేయాలని నిరుద్యోగులు పలు చోట్ల నిరసనలకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు డీజీపీ జితేందర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయని.. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. గ్రూప్‌-1 అభ్యర్థులు సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టుకు వెళ్లాలన్నారు. రోడ్ల మీద ఆందోళన చేస్తే ఊరుకోమని డీజీపీ హెచ్చరించారు.