అక్షర టుడే, కామారెడ్డి టౌన్: పీఎంపీ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పులగం మోహన్, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ హాజరై ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకిషన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, కోశాధికారి నర్సింలు, ఉపాధ్యక్షులు విఠల్, శివారెడ్డి చారి, శివ దయాల్, సంజీవరెడ్డి చంద్రశేఖర్, గోపి శ్రీనివాస్ ,ఓం ప్రకాష్ వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.