Bhu Bharati | రైతుల పాలిట శాపం ‘ధరణి’

Bhu Bharati | రైతుల పాలిట శాపం ‘ధరణి’
Bhu Bharati | రైతుల పాలిట శాపం ‘ధరణి’

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhu Bharati | బీఆర్​ఎస్ BRS​ హయాంలో తీసుకొచ్చిన ధరణి Dharani రైతుల పాలిట శాపమని సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy అన్నారు. భూ భారతి Bhu Bharati పోర్టల్​ ప్రారంభోత్సవం సోమవారం సాయంత్రం శిల్పా కళావేదికలో నిర్వహించారు.

Advertisement
Advertisement

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. బీఆర్​ఎస్ ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు ప్రజలను దోచుకోవడానికే ఉన్నారనే విధంగా ప్రచారం చేసిందని ఆరోపించారు. కొంత మంది అధికారులు తప్పులు చేస్తే రెవెన్యూ వ్యవస్థను మొత్తం దోషులుగా చూపిందన్నారు. దీంతో చట్టాలను మార్చి వేలాది ఎకరాల భూములను బీఆర్​ఎస్ BRS​ నాయకులు కొల్లగొట్టారన్నారు.

భూమి కోసం తెలంగాణ Telanganaలో ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ Congress​ పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే రైతుల ఇబ్బందులు తొలగించడానికే భూ భారతి పోర్టల్​ తీసుకు వచ్చామన్నారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ఈ పోర్టల్​ను ప్రారంభించామని సీఎం తెలిపారు.

Bhu Bharati | ఈ మండలాల్లో అమలు

మొదటి విడతగా నాలుగు మండలాల్లో పైలెట్​ ప్రాజెక్ట్​గా ఈ పోర్టల్​ అమలు చేస్తామని సీఎం వివరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్​, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో భూ భారతి మొదట అమలు చేస్తామన్నారు. భూ భారతిని పక్కాగా అమలు చేయాలని రెవెన్యూ సిబ్బందిని కోరారు. తమ ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూడటం లేదన్నారు. తాము వారిని సంపూర్ణంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  SC Classification | ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

Bhu Bharati | భూధార్​ నంబర్​

ఆధార్​ తరహాలో భూధార్​ నంబర్​ తీసుకు రావాలని సీఎం అన్నారు. ఇది అసాధ్యమైన పనికాదని పేర్కొన్నారు. భూ కమతాలకు హద్దులు నిర్ణయించి ప్రత్యేక నంబర్​ ఇవ్వాలన్నారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లి ప్రజలకు భూ భారతిపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేలా భూ రికార్డులు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.

Advertisement