అక్షరటుడే, వెబ్ డెస్క్: డయల్ 100 కాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఎస్సైపై బదిలీ వేటు పడింది. నిజామాబాద్ ఐదో టౌన్ ఎస్సై అశోక్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి 100 కాల్ రాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీపీ గుర్తించారు. అనంతరం స్టేషన్ ఎస్ హెచ్ వో బాధ్యతల నుంచి తప్పించారు. కాగా.. ఈయన గతంలోనూ రెండో టౌన్ ఎస్సైగా పనిచేసిన సమయంలో కూడా ఇలాగే హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ అయ్యారు.