అక్షరటుడే, నిజామాబాద్‌ రూరల్‌ : రైతులకు షరతులు లేకుండా ప్రభుత్వం రూ. రెండు లక్షల రుణమాఫీ చేయాలని సొసైటీ ఛైర్మన్ రాంచందర్‌ గౌడ్‌ అన్నారు. డిచ్‌పల్లి సొసైటీలో సోమవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకకాలంలో రూ. రెండులక్షల రుణమాఫీ చేయాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో సొసైటీ వైస్‌ ఛైర్మన్ కుమార్‌ గంగారం, సీఈవో కిషన్‌, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.