అక్షరటుడే, వెబ్‌డెస్క్ Health Problems : ప్రస్తుత కాలంలో ప్రజలు సాయంకాల సమయంలో స్నాక్స్ లాగా వేరుశనగపల్లి తింటూ ఉంటారు. ఈ వేరుశనగ పల్లీలు ఎంతో రుచిగా ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువే. ఈ పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు కూడా ఉంటాయి. వేరుశనగ పల్లీలను వేయించి, లేదా పచ్చిగా అయినా, లేదా ఉడికించి కూడా తినవచ్చు. నానబెట్టిన పల్లీలను ఉదయం పరిగడుపున తీసుకుంటే ఆ రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. పల్లీలను కొంతమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే , ఈ పల్లీలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని తిన్న వెంటనే నీళ్లు తాగటం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. అలా తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
వేరుశనగలు తిన్న తరువాత అనారోగ్య సమస్యలు : పచ్చి వేరుశనగలు అయినా, నానబెట్టిన వేరుశనగలు అయినా, వేయించిన వేరుశనగలు అయినా సరే తిన్న వెంటనే నీటిని తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు. కారణం, వేరుశనగలు గట్టిగా ఉండడం వలన అవి, కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వాటిని తిన్న వెంటనే నీటిని తాగితే జీర్ణ క్రియ మందగిస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. వేరుశనగలు తిన్న వెంటనే నీటిని తాగితే జీర్ణక్రియ వ్యవస్థలోని ఎంజైమ్ ల పనితీరుకు అంతరాయం కలగవచ్చు.
వేరుశనగలు ఎక్కువగా తిన్నాక శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. అప్పుడు, మీరు వెంటనే చల్లని నీరు తాగితే, మీ శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం, వంటి సమస్యలు వస్తాయి. వేరుశనగలు కొద్దిగా జిడ్డుగా ఉంటాయి. తిన్న వెంటనే నీరు తాగితే మీ గొంతులోని తేమ తగ్గి గొంతు నొప్పి వస్తుంది. వీటిని తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాలు ఆగి ఆ తరువాత నీరు తాగితే మంచిది.
వేరుశనగలు తిన్నాక ఇవి కూడా తినకూడదు : వేరుశనగలు తిన్న తర్వాత తినకూడనివి కూడా మరి కొన్ని ఉన్నాయి. పల్లీలు తిన్న తర్వాత నీటిని తాగితే ఎంత ప్రమాదమో.. అలాగే, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, సిట్రస్ పండ్లు, పాలు వంటివి కూడా తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగలలో నూనె ఉంటుంది. కాబట్టి వీటిని తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణం కావడం కష్టం. కాబట్టి ఇవి తిన్న తర్వాత కనీసం అరగంటసేపు ఆగి ఆ తర్వాత నీటిని తాగితే మంచిది. కేవలం ఇవే కాదు , ఏ ఆహరం తిన్న తరువా అయినాసరే, నీటిని త్వరగా తాగకుడదు. తాగితే జీర్ణ సమస్యలు తప్పవు.