అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagtial | కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో భేదాభిప్రాయాలు ఉండటం సహజమని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ MLA Adluri Laxman Kumar అన్నారు. జగిత్యాల కాంగ్రెస్‌లో కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ బీఆర్ఎస్(BRS) నుంచి గెలిచిన సంజయ్ హస్తం గూటికి చేరడంతో సీనియర్ లీడర్ జీవన్‌రెడ్డి(Jeevan Reddy) కొద్దిరోజులుగా పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో విప్ లక్ష్మణ్‌కుమార్ స్పందించారు. ఎమ్మెల్యే సంజయ్, జీవన్‌రెడ్డి మధ్య విభేదాలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. పరస్పరం వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదని ఆయన సూచించారు. అధిష్ఠానం దృష్టికి సమస్యను తీసుకు వెళ్తానన్నారు.