అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | విద్యార్థులు, అభ్యర్థుల కోసం డిజిటల్ లైబ్రరీ(Digital Library)ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) తెలిపారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీDigital Library) విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత(Unemployed youth) కోసం ఇంటర్నెట్ సేవలు(Internet services) ప్రారంభించామన్నారు. గ్రంథాలయం(Library)లో స్థలం సరిపోవకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే పాత డీఈవో(DEO) కార్యాలయంలోని పలు గదులను రీడింగ్ రూమ్(Reading Room)గా వినియోగిస్తున్నట్లు చెప్పారు.
లైబ్రరీ(Library)లో చదువుకున్న సుమారు 160మంది యువతీయువకులు ఉద్యోగాలు(Jobs) సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికారులు రాజారెడ్డి, నరేష్ రెడ్డి, రాజేశ్వర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.