అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఎంపీ అర్వింద్ అధ్యక్షతన శనివారం ప్రారంభమైంది. జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రోడ్లకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్ పాల్గొన్నారు.