అక్షరటుడే, ఇందూరు: DMHO | ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా.. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం కంటి అద్దాలు అందించింది. జిల్లాలో 1,277 మంది విద్యార్థులకు కంటి అద్దాలు సరఫరా చేసినట్లు డీఎంహెచ్‌ఓ రాజశ్రీ తెలిపారు.
మంగళవారం కంజరలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాలు అందజేశారు. జిల్లావ్యాప్తంగా ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో అద్దాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాల జిల్లా అధికారి అశోక్, స్కూల్ ప్రిన్సిపాల్ విజయ, మేనేజర్ సచిన్, వైద్యులు మాధవి, సందీప్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.