అక్షరటుడే, ఆర్మూర్‌: భీమ్‌గల్‌లో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతులమీదుగా 224 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ కన్నె ప్రేమలత, ఏఎంసీ చైర్మన్‌ నర్సయ్య, వైస్‌ ఛైర్మన్ భగత్, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.