Ration Cards | నేటి నుంచి రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ

Ration Cards | నేటి నుంచి రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ
Ration Cards | నేటి నుంచి రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Cards | తెలంగాణ ప్రభుత్వం రేషన్​కార్డు(Ration Card) లబ్ధిదారులకు ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కాగా తాము అధికారంలోకి వస్తే రేషన్​ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

Advertisement
Advertisement

ఏప్రిల్​ కోటా బియ్యం ఇప్పటికే రేషన్​ దుకాణాలకు చేరింది. దీంతో ఏప్రిల్​ 1 తేది నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడాని సీఎం రేవంత్​రెడ్డి హుజూర్‌నగర్‌(Huzur Nagar)లో పర్యటించనున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌ నుంచి సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్‌లో రేవంత్​రెడ్డి రామస్వామి గుట్ట వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం