అక్షరటుడే, ఆర్మూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ సూచించారు. పట్టణంలోని మోడల్ స్కూల్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిలో వండిన ఆహార పదార్థాలను, హాస్టల్లో నిలువ ఉంచిన సరుకులను, తాగు నీటిని పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పర్యవేక్షించారు. ఆయన వెంట ఆర్మూర్ తహశీల్దార్ గజానన్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, వార్డ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు.