అక్షరటుడే,కోటగిరి: మండల కేంద్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది సర్వేను పక్కగా చేపట్టాలని, ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సూచించారు. సర్వేలో వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ గంగాధర్, ఎంపీఓ చందర్, తదితరులు ఉన్నారు.