అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర మూడో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్- 2025లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. బాసర జోన్-2 తరఫున 61మంది క్రీడాకారులు పాల్గొనగా, 26 పతకాలు సాధించారు. దీంతో ఇన్ఛార్జి సీపీ సింధుశర్మ వారిని అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, రాంచందర్ రావు, శ్రీనివాసరావు, సతీష్, తిరుపతి, శ్రీనివాస్, శేఖర్, తదితరులు ఉన్నారు.