అక్షరటుడే, ఇందూరు: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా సివిల్‌సప్లయ్‌ అధికారి అంబదాస్‌ రాజేశ్వర్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గంజ్‌లో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యంలో మాయిశ్చర్‌ శాతాన్ని పరిశీలించారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.