అక్షర టుడే, కామారెడ్డి టౌన్: ఇండియన్ రెడ్ క్రాస్ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్ మెంట్ కమిటీ నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలని, సామాజిక కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొన్నారు. అంతకుముందు గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, చీఫ్ ప్లానింగ్ అధికారి రాజారాం, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, రెడ్ క్రాస్ సొసైటీ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు