అక్షరటుడే, కామారెడ్డి : ప్రస్తుత 2024-25 సీఎంఆర్ కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ధాన్యం కేటాయింపులు జరుగుతున్న దృష్ట్యా మిల్లర్లు గ్యారంటీలను, అగ్రిమెంట్లు అందజేయాలని కలెక్టర్ సూచించారు. 2021-22, 2022-23కు గాను పెండింగులో ఉన్న సీఎంఆర్ వెంటనే సరఫరా చేయాలని లేకపోతే డిఫాల్ట్ అయిన మిల్లులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహరావు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.