అక్షరటుడే, కోటగిరి: మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా సరిహద్దులోని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. ఈ మేరకు పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మద్యం దుకాణాలు మూసివేశారు. ఈ నెల 20వ తేదీ వరకు మూసిఉంచనున్నారు. అలాగే 23న ఓట్ల లెక్కింపు కారణంగా ఆ రోజు కూడా వైన్స్ షాపులు బంద్ ఉండనున్నాయి.