అక్షరటుడే, ఇందూరు: నిజాంసాగర్ జవహర్ నవోదయలో (2025-26 విద్యా సంవత్సరానికి) ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. దరఖాస్తులను సెప్టెంబర్ 16వ తేదీ లోపు www.navodaya.gov.in వెబ్ సైట్ లో నమోదు చేయాలన్నారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ప్రిన్సిపాల్ ను 9701907749 సంప్రదించాలన్నారు.