అక్షరటుడే, జుక్కల్: పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా నిజాంసాగర్ మండల ప్రత్యేకాధికారి విజయభాస్కర్ సూచించారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేటలో అమ్మ ఆదర్శ పాఠశాల, సంపద వనాలు, నర్సరీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే గోర్గల్ గ్రామంలో నర్సరీ, పాఠశాలలను సందర్శించారు. నర్సరీలో మొక్కలు నాటించాలని కార్యదర్శిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, ఎంపీవో యాదగిరి ఉన్నారు.