Advertisement
అక్షరటుడే, బోధన్ : Hospital | బోధన్ పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో కనీస వసతుల్లేక రోగులు అవస్థలు పడుతున్నారు. కనీసం స్ట్రెచర్ సదుపాయం కూడా లేక రోగులను బంధువులే మోసుకెళ్లే పరిస్థితులు వచ్చాయి. గురువారం పక్షవాతంతో బాధపడుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు గురువారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రిలో 12 మంది వార్డు బాయ్స్ ఉన్నప్పటికీ.. ఎవరూ అందుబాటులో లేరు. స్ట్రెచర్ కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులే ఆయనను మోసుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.
Advertisement