అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వడ్ల తేమశాతాన్ని పరిశీలించారు. మంత్రి వెంట రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.